కొత్త రాజ్యాంగం ........ !
అదిగో ... వాడు ... ముస్లిం .....
వాడ్ని తెగనరకండి ....!
ఇదిగో ..... వీడు హిందు ....
వీడ్ని కాల్చి బూడిద చెయ్యండి ....!
అదిగో .... వాడి సిద్ధాంతం నచ్చలేదు ..
వాడ్ని .... లేపేయండి ..... !
ఇదిగో .... వీడి వ్యవహారం నచ్చలేదు ....
వీడ్ని ... చంపెయ్యండి ..... !
నచ్చని వాడిని నరికేద్దాం ..,
ఎదురు మాట్లాడిన వాడిని ... లేపేద్దాం ...
ఇదే కదా ... మన కొత్త రాజ్యాంగం ...!
ఇదే కదా ....
మన మానవ జాతి అలిఖిత ...
కొత్త సాంఘిక గ్రంధం ..... !
శాంతా ... ??? ఏ అమ్మాయి పేరది???
సహనమా ...??? ఎక్కడుంది .. ఈ నైట్‌క్లబ్బు ... ???
చెట్లను ..... నరికేస్తున్నాం ...
మన కలల దాహానికి ...!
జంతువులను .... చంపేస్తున్నాం ...
మన ఆకలికి .....!
మనుష్యుల్ని .... కూడా ... చంపేద్దాం ....
మన అహం తృప్తికి .... !
రండి ..
మనిషనే ... ప్రతీ వాడినీ ...
ఏదో ఒక కారణం వెతికి ...వెతికి .....నరికేద్దాం ...!
మనకి నచ్చని ప్రతీవాడినీ .....
ఎదో ఓ మిషతో .... లేపేద్దాం .....!
ఆ శవాల గుట్టలమీంచి నడుచుకుంటూ ..... వెళ్ళి ....
ఆ స్మశానాలను ..... ఆనందంగా ... ఏలుకుందాం .....!
ఛీ ........ ఎక్కడ ఉన్నాం మనం ..... ???
- శ్రీ శైలు .... !
28 - December - 2007; 04:45 AM: Hotel Shangri La, New Delhi ..!
(పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్యోదంతం విన్న షాక్‌లో ........)
************************************
ఆవిర్భావం:
Sarcastic ధోరణిలో రచనలు చెయ్యొద్దని నేనే చాలా సార్లు ... చాలా
మందికి చెప్పడం జరిగింది. కోరడం జరిగింది. కానీ ఇప్పుడు నేనే అలా
రాయడం నాకూ చాలా ఇబ్బందిగానే ఉంది ... !
Flight దిగి, అలా INDIA నేల మీద అడుగుపెట్టి, Hotel గదికి వచ్చి,
T.V. ON చేసేటప్పటికీ ..... BENAJIR'S ASSASINATION అంటూ ....
పెద్ద పెద్ద అక్షరాలతో ..... ఏ ఛానల్లో చూసినా ........ అదే
Scrolling. ఏ ఛానల్ మార్చినా అదే .... విషయం ..... !
విషయం పూర్తిగా చూసి ... ఓ విధమైన షాక్‌కి గురయ్యాను .... !
Diplomatic గా భారత్‌కు పొరుగు దేశంతో ..... సంబంధ బాంధవ్యాలు
పెంచుకునేందుకు మిగిలిన ఆఖరు అవకాశం ఆమె ...! నాకు తెలిసి
పాకిస్థాన్లో మిగిలిన ఏకైక LIBERAL MUSLIM LEADER ఆమే ....! మిగతా
వాళ్ళంతా మత ఛాందస వాదులే ....! పాకిస్థాన్ ఏర్పడిన నాటి నుండి
నేటి వరకూ ..... సరైన VISIONARIES అక్కడ పాలకులుగా రాకపోవడం ఆ
ప్రజల దురదృష్ఠమే తప్ప మరోటి కాదు. మిగిలిన ఒక్క వ్యక్తినీ ఇప్పుడు
... లేకుండా చేసారు ...! ఇదే సాకుగా .... ముషరఫ్ ... మళ్ళీ
EMERGENCY విధించే విధంగా ..... ఖచ్చితంగా ... పావులు కదుపుతాడు.
ఇక అక్కడ ప్రజా స్వామ్య పునరుధ్ధరణ అన్నది నీటి మూటేనేమో ..????
ఇలా జరిగితే ... భారత్ - ఇరాన్ పైపు లైను పరిస్థితి ఏమిటి ?? ఈమె
అధికారంలోకి రాగానే తేల్చుకుందామన్న మొండి ధైర్యంతోనే కదా భారత్
ఇన్నాళ్ళూ ఊరుకుంది. అదే జరగక పోతే 2010 తరువాత భారత్ పరిస్థితి
ఏమిటి?? ఇంధనం మీదే మెత్తం దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు
ఇంధన భద్రత లేకపోతే పరిస్థితి ఏమిటి?? ONGC, Reliance & Other
Companies private గా లీజుకి తీసుకున్న అన్ని బ్లాకుల్లోనూ oil
production ప్రారంభించినా కూడా .... అవన్నీ కలిపినా .... మెత్తం
Demand లో కనీసం 12% కూడా చెరుకోలెమే ???? అప్పటికి బారెల్ చమురు
ధర 200 డాలర్లు దాటిపోతుందని OPEC చెప్పకనే చెపుతోంది. మరి ఇంధనం
దిగుమతి మీదే ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్నంతా ఖర్చు పెడితే
Development సంగతి ఏమిటి? Social Welfare & Rural Infrastructure
ఇవన్నీ ఏమై పోతాయి?? GDP ఏమైపోతుంది ...?? మనమనుకున్న లక్ష్యాలను
ఎలా చేరుకుంటాం?? మెత్తం పరిస్థితే ప్రశ్నార్ధకంగా ఉంది కదా???
ఇవన్నీ ఆలోచించిన తరువాత పుట్టిన షాక్‌లోంచి తయారయ్యిందే ఇది. నాకు
తెలిసి ఇది కవిత కాదు. అక్షరీకృతమైన ఓ బాధ అంతే ...!
ఏది ఏమైనా కాలానికి REWIND బటన్ ఉండదు ... !
అందుకే .... ఆమె ఆత్మకి శాంతి కలగాలనీ ...., ఆమెకు ...
అల్లాలోకమయిన ... ఆ ... జన్నత్ ... ప్రాప్తించాలనీ, ఈన్షా అల్లా
..... !
మనస్పూర్తిగా కోరుకుంటూ ....!
- శ్రీ శైలు ... !
No comments:
Post a Comment