శ్రీ శ్రీ గురించి ......!
"పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
మరో ప్రపంచం పిలిచిందీ"అంటూ
మమ్మల్నందరినీ .... తొందరపెట్టి ...,
నీ ఇనుప కవిత్వంతో .....
మా మనసుల్లో కరుడుకట్టుకు పోయిన
ఛాందసవాదాన్ని అరగదీసి ....,
నిద్ర మత్తులో తూలుతున్న
కార్మిక శక్తిని ..... నిద్ర లేపి ....,
"తెలుగువీర లేవరా" అంటూ ....
ధైర్యం చెప్పి .....,
"కొంతమంది యువకులు
ముందు యుగం దూతలు" అంటూ ..
యువశక్తికి ఉత్తేజాన్నిచ్చి .....,
"విశాల విశ్వం నిర్మాణానికి ...
చక చకమంటూ అడుగులు వేద్దాం" అంటూ ....
మమ్మల్నందరినీ .... మరో ప్రపంచం వైపు ....
నడవమని చెప్పి ......,
నువ్వు మాత్రం ......
ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా .......???
నాకు తెలుసులే ......!
నువ్వు ఖచ్చితంగా ....
నరకానికే ... వెళ్ళుంటావు .....!
ఎందుకంటే .....???
నువ్వు చేసిన పాపాలు ... ఒకటా ..?? రెండా ...??
ఎన్ని పాపాలు చేశావు ...... నువ్వు ...???
ఛాందస వాదాల పిడివాదాల్ని ....,
ధైర్యంగా ఎదిరించావా ..... ???
చైతన్యం కోల్పోయి ....
నిద్రమత్తులో తూలుతున్న యువతరాన్ని ....
వాళ్ళ మత్తు నిద్రలోంచి లేపావా .... ???
హక్కులంటే తెలీక ....
బానిస వ్యవస్థలో బ్రతుకుతున్న కార్మికుడ్ని ....,
ఉత్తేజితం చేసి .....,
హక్కుల కోసం పోరాటాలు ... చేయించావా ...???
"ఎముకలు క్రుళ్ళిన .... వయస్సు మళ్ళిన"
శ్రామికుల్ని వదిలించావా ......???
అర్ధంలేని అలంకారాలతో....,
కాలం చెల్లిపోయిన పోలికలతో ....,
జనం మొహం మొత్తిపోయిన కవితా వస్తువులతో ...,
పాత చింతకాయ పచ్చడి ధోరణులను ....
పట్టుకు వ్రేలాడుతున్న కవితాలోకానికి ....,
మరో క్రొత్త దిశా నిర్దేశం చేశావా .....???
ఎన్ని పాపాలు చేసావు .... నువ్వు ???
అందుకే ... నరకానికి వెళ్ళిపోయావా ...???
వెళ్తే వెళ్ళావులే కానీ ..... ఇంతకీ ....
ఎప్పుడు తిరిగి వస్తున్నావు ....... ???
ఆ ...... !!!!!!
ఇక్కడకంటే .... నీకు ....
ఆ లోకమే ... బావుందా ....???
అవునులే ....... అక్కడ .....
పశ్చాత్తాపంతో కుములుతున్న వాళ్ళూ ....,
తప్పులకు .... పాప పరిహారం చేసుకుంటున్న వాళ్ళూ ...,
పశ్చాత్తాప పరితప్త హృదయాలూ ఉంటాయి .....!
కానీ ... ఇక్కడ .... అవేవీ లేవుగా ....!!!
జనారణ్యంలో.... ముసుగులుకప్పుకుని ...,
తిరుగుతున్న మనుష్యాకారపు ... మృగాలు తప్ప ....,
ఇక్కడింకేమీ లేవులే .....!!!
అందుకే ...... అక్కడే ..... ఉండిపోయావా .. ???
పోనీలే .......!
నిన్నిక్కడెలాగూ సుఖంగా బ్రతుకనివ్వలేదు .....
మేమందరం కలసి ....!
కనీసం .... అక్కడైనా ....
సుఖంగా .......... బ్రతుకు .......!
అందుకో .... నీకిదే ... నా అశ్రు నివాళి ........!
- శ్రీ శైలు ....!
(23 - March - 1992; 22:35 PM; Kaki Street Residence; YANAM)
(ఇది రాసినప్పుడు నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను .........!అందుకే కవితా పరంగా అంత గొప్పగా ఉండదు. కానీ భావంలో VIRGINITY, కవితలో HONESTY మాత్రం పుష్కలంగా ఉంటాయి.)
No comments:
Post a Comment