మేఘార్తి ....!
ఆకాశంలో మేఘాలన్నీ....,
కలసి కట్టుగా .., ఓ పక్షి బారు లాగ ....,
గంభీరంగా ......, భీకరంగా ......,
కవాతు చేసుకుంటూ .......,
తేలుకుంటూ .... వెళ్ళిపోతున్నాయి ....!
ఓ పొలం చెలకకి నీటికోసం ....
బీడు వారిన పొలంలో ...,
దిగాలు పడి కూర్చుని ఉన్న రైతుని ....
ఓ సారి పలకరించి .... పలవరిద్దామని లేదు ....!
దాహార్తికి గుక్కెడు నీళ్ళ కోసం .....
నాలుక ఆర చాపుకుని ....
ఆకాశంకేసి అర్రులు చాస్తున్న నిర్భాగ్యుడికి .....
గుక్కెడు నీళ్ళిచ్చి .... బరువు దింపుకుందామనీ లేదు .....!
అలా నిర్దాక్షిణ్యంగా ...., నిర్వికారంగా ....,
ఆకాశంలో సాగి పోతున్నాయి ....!
ఏ ప్రియురాలికి ..... , ఏ ప్రియుడి .....
సందెశాన్ని మోసుకుపోతున్నాయో .. ??? కానీ .....,
అలా సాగిపోతున్నాయి ...!
దాహార్తికి గుక్కెడు నీళ్ళ కోసం .......
ఆకాశం కేసి అర్రులు చాస్తున్నవాడా .......,
పొలంచెలకకి నీటి కోసం .....
రెండు చేతులూ బారగా ఆకాశం కేసి చాచి ....
ప్రార్ధిస్తూ నిలబడ్డవాడా ......,
నీ ప్రార్ధనలూ .., నీ అర్రులు ... గుర్తించకుండానే ....,
నీ బ్రతుకు ఆశల మీదనుంచీ .....,
నీ జీవన శ్వాసల మీదనుంచీ .....,
నిర్దాక్షిణ్యంగా తేలుకుంటూ ....... వెళ్ళిపోతున్నాయి ......!
మేఘాలన్నీ కలసి ...
నీమీద నిరసన తెలియజేస్తూ .....
ప్రఛ్ఛన్న యుధ్ధం ప్రకటిస్తున్నట్లే ఉంది .....!
ఈ పంటకి ....,
ఇంక నిన్ను కరుణించడం .....
ఇష్టం లేనట్లే ఉంది ..........!
ఇంక లాభం లేదు ...! పద ....!
నీ కన్నీళ్ళనీ ..., నీ చెమటనీ ....,
ఆఖరుకి నీ రక్తాన్నైనా సరే ......
ధారపోసి పంట పండిద్దువుగాని ... పద ...!
ఎన్ని కన్నీళ్ళు కలిస్తే .....
ఓ పొలం చెలక తడుస్తుంది ....????
ఎన్ని చెమట చుక్కలు కారాలి ....???
ఓ గీంజ నాటుకోవడానికి .....!!!
ఎన్ని రక్తపు చుక్కలు .....
ఎరువుగా ధార పొయ్యాలి ....???
ఓ మొలక మొలకెత్తడానికి .....!!
- శ్రీ శైలు ...!
( 23 - May - 2000; Farm House; Coconut Groove; ALAMURU )
(అంతకంతకూ అంధకారబంధురమయి పోతున్న రైతు జీవితాల మీద జాలితో ........., సానుభూతితో .......)
No comments:
Post a Comment