Monday, April 21, 2008

డిప్లొమసీ ....!

డిప్లొమసీ ....!

వినీల వీధుల్లో విహరిస్తున్న
విపంచిని చూసి పైకి పరవశించకు ....!

ఆరబోసిన ప్రకృతి అందాల్ని ...
పైకి పలవరించకు ....!

ఓ పరవశం తరువాతి ఆనందభాష్పాల్ని ....
కనురెప్పలు దాట నివ్వకు ....!

ఓ స్వప్నం తాలుకూ ... ఆనందాన్ని ....
పైకి ప్రతిబింబించకు ....!

ఓ ఆనందాన్నీ ..., ఓ దుఃఖాన్నీ .....,
ఓ కోపాన్నీ ....., ఓ సంతోషాన్నీ ...,
దేన్నీ ...... పైకి కనిపించనీయకు .....!

మనసులో మెదిలే ఊహనీ ....., భావాన్నీ ...,
అలాగే ఉండనీ ........!

మనసులో మాటని ....
మూటకట్టి అక్కడే దాగనీ ....!

గొంతులో పాటనీ .....
పైకి రానివ్వకు ...!

మదిలోని రాగాన్ని .....
అక్కడే బంధించు ....!

ఇది .... ఓ .... డిప్లొమేట్ సొసైటీ ....!

లోలోపల అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నా ....
పైకి మాత్రం హాయిగా .... నవ్వడమే .....
ఈ సొసైటీ సూత్రం ...!

ఇక్కడ .....
హృదయపులోతుల్లోంచీ ....
గొంతు చించుకుని అరిచే ...
నీ లాంటి వాళ్ళకి స్థానం లేదు .........!

- శ్రీ శైలు ....!

(10 - JANUARY - 2000; The LOBBY; Hotel Green Park; Begampet; HYDERABAD)

(బ్రతుకుతున్న డిప్లొమేటిక్ సొసైటీ మీద విరక్తితో ......., జాలితో ........)

No comments: