Friday, April 18, 2008

తరలివచ్చే ఆనందం ....!

తరలివచ్చే ఆనందం ....!

నువ్వు మా ఇంటికి రాగానే ...,
మా హృదయాలు ..... నందనవనాలవుతాయి...!

నీ బోసి నవ్వులు .....,
మా ఎడారి హృదయాల్లో ....
ఒయాసిస్‌లు అవుతాయి ..... !

నీ హావ భావాలతో ...,
నీ అల్లరి చేష్టలతో ....,
పనుల్లో ఉన్న మమ్మల్నందరినీ .....,
నీ చుట్టూ చేర్చుకుంటావు ......!

నీ కల్మషం లేని బోసి నవ్వులతో ...,
నీ నిష్కళంక .... నిర్మల మనస్సుతో ...,
మమ్మల్నందరినీ కట్టిపడేస్తావు ...!

నీ తీపి అల్లరులతో మురిపించి ..., మరపించి ...,
నీ ఆట పాటలతో మమ్మల్నందరినీ ....
ఓ అవ్యక్తానంద అచేతన స్థితిలో వదిలి ....,
పెద్ద పని ఉన్నట్లుగా .... వెళ్ళి పోతావు ....!

ఆ స్థితిలో ఉన్న మాకు .......,
నీ మనసే సంకేతాలు పంపుతుందో ...... లేక .....,
నీ దగ్గరే పారేసుకున్న ....
మా మనసుల్ని తెచ్చుకోవడం కోసమో .....,
నీ వెనుకే ......
నీ ఇంటికి వచ్చి వాలతాం ....!

నిన్ను ఎత్తుకుని ....,
బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ....
మరో అలౌకిక ప్రపంచంలో ..... తేలుతూ ఉంటాం ....!

ఇంతలో ...... ఓ .... ఈ లోకపు పిలుపుతో .....,
నీ ఆనందాన్ని వీడలేక .....,
మనసు రాక ....., అనివార్యమై .....,
నీ జ్ఞాపకాల్ని ....,
మా మనసు గంపలకెత్తుకుని ....,
ఆ జ్ఞాపకాల్లో ....,
ఎప్పుడో ....... ఎక్కడో .....
పారేసుకున్న .....
మా .... పసితనాల్ని ......
వెతుక్కుంటూ .....
తిరుగుముఖం పడతాం ..... !


- శ్రీ శైలు .....!

( 23 - APRIL - 2000; 18:55 PM; KRISHNA BAAVA Residence, YANAM)

(లలిత వదిన కూతురు, మా ప్రియ ఆత్మ బంఢువు అయిన చిరంజీవి "ప్రత్యూష" గురించి)

No comments: