గుమ్మంలోంచి అడుగు ...
బయట ... పెట్టీ పెట్టగానే ......
"హలో" అంటూ....గుమ్మంలోనే పలకరించాయి ....... !
నేనూ కాళ్ళు పెట్టి ....పలకరించగానే .....
కిర్రు మంటూ ... బయలు దేరాయి ...
ప్రపంచ యాత్రకి ....!
మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ ...
ఎప్పటిలా గుమ్మం బయటే .....
వాటి స్థానంలో అవి .... మామూలుగా .... !
ప్రపంచ యాత్రకు పనికొచ్చిన మిత్రుడు .....
గృహ యాత్రకు పనికిరాడెందుకో .........????
- శ్రీ శైలు .....!
(17 - JUNE - 1992; 04:45 AM; YANAM Residence)
(అంటరాని తనం మీది అసహ్యంతో, బడుగు వర్గాల మీది సానుభూతితో .........)
No comments:
Post a Comment